ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. జూబ్లీ క్లబ్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఖమ్మం జిల్లా కోర్టు న్యాయవాదులు , జీపీలు , పీపీలు, స్టీరింగ్ కమిటీ సభ్యులు గజమాల వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు.
మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా న్యాయవాద సోదరీ , సోదరులను కలుసుకొని వీరి మధ్య గడపటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. న్యాయవాదులు అందరూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయవాదుల అభివృద్ధికి, సంక్షేమానికి వంద కోట్లు కేటాయించడంతో పాటు ఖమ్మం జిల్లా కోర్టులు, జీపీలు, పీపీలు, స్టీరింగ్ కమిటీ నియామకంలో సామాజిక న్యాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణారావు జీపీ.హరేందర్ రెడ్డి , పసుపులేటి శ్రీనివాస్ రావు , బెల్లం ప్రతాప్ , రామారావు , హైమావతి , ఎండీ ఇర్షాద్ , అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ , స్టాండింగ్ కౌన్సిల్ బసవపున్నయ్య , పోట్ల శ్రీకాంత్ , జే ఏ సీ నాయకులు బిచ్చాల తిరుమలరావు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.