ఖమ్మం/ రఘునాథపాలెం, ఆగస్టు 28 : రేషన్‌షాపుల్లో పప్పు, ఉప్పు, సబ్బులు, ఇతర సరుకులు అమ్మితే డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా రేషన్‌డీలర్ల అసోసియేషన్‌కు చెందిన అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
గత నెల ఆకస్మిక తనిఖీల సందర్భంగా పలు షాపుల్లో కిరాణం సరుకులైన సబ్బులు, ఉప్పు, పప్పు, నూనె ప్యాకెట్లను పెట్టి అమ్మకాలు చేస్తుండటాన్ని గుర్తించి ఆగ్రహానికి గురయ్యారు. ఈ నెల తనిఖీలకు వచ్చినప్పుడు ఎలాంటి కిరాణం సరుకులు షాపుల్లో కనిపించరాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా రేషన్‌డీలర్లు యూనియన్ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి జిల్లాకేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయించాలని అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న, ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియా, దొండ దుర్గయ్య