Home
Khammam
Additional Collector Madhusudannayak Said That Election Staff Should Be Aware Of The Procedures
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్
మామిళ్లగూడెం, మార్చి 23 : ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు.
సీ-విజిల్ యాప్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి ఫొటోలు, వీడియోలతో సహా సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.రాజేశ్వరి, మాస్టర్ ట్రైనీ కొండపల్లి శ్రీరామ్, అసిస్టెంట్ మాస్టర్ ట్రైనీ మదన్గోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

