అనుమతి లేకుండా చెరువు మట్టి తవ్వితే చర్యలు
కారేపల్లి, మే 13 : అనుమతులు లేకుండా చెరువులు, కుంటలలో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్‌నాయక్ హెచ్చరించారు. గేట్‌కారేపల్లి సమీప తుమ్మలకుంటలో చేపడుతున్న చెరువు పూడిక పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు పంట చేలకు మాత్రమే మట్టితోలకాలు జరపాలని అన్నారు. అనుమతులు లేకుండా చెరువులు, కుంటల్లో మట్టి తవ్వకాలు చేపడితే వాహనాలను సీజ్ చేసి కేసులు పెడతామని పేర్కొన్నారు.
ఉపాధి పనులను వినియోగించుకోవాలి
కామేపల్లి, మే 13 : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సీలార్సాహెబ్ అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీరాణీ, కార్యదర్శులు పాల్గొన్నారు.
పనులు పరిశీలించిన కేంద్ర బృందం
పెనుబల్లి, మే 13 : ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం కొండ్రుపాడు, కొత్త, పాతకారాయిగూడెం, మండాలపాడు గ్రామాల్లో పరిశీలించారు. పనుల రికార్డులను తనిఖీ చేశారు. బృందంలో నాగరాజు, విశ్వనాథం, అడిషనల్ ఈడీ శిరీష, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఏపీవో రంగనాయకమ్మ, జేఈ మధుసూదన్‌రావు, పీఆర్ జేఈ సాయి ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

