ACP Rahman | మధిర: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైరా ఏసీపీ రహెమాన్ హెచ్చరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ, కుల, మత, ప్రాంతీయ వివాదాలకు తావు ఇచ్చేలా వ్యవహరించకూడదన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు. ఏదైనా వర్గాన్ని కించపరిచేలా తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఒక గ్రూపులో ఇలాంటి పోస్టులు షేర్ అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణించబడతారు అని తెలిపారు.
ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. అనుచిత పోస్ట్‌లను ఫార్వర్డ్ చేసిన వారిపైనా కేసులు నమోదు చేయబడతాయని పెర్కొన్నారు. కాబట్టి, సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేకూర్చే విధంగా మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారి పై కఠిన చర్యలు తప్పవని సూచించారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం