కశ్మీర్ కొత్త చరిత్ర
సుదీర్ఘ నేపథ్యం కల్గిన రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. అరంగేట్రం చేసిన 67 ఏండ్ల తర్వాత తొలిసారి టోర్నీలో ఫైనల్ చేరి ఔరా అనిపించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ పోరులో నిలిచింది. రెండు సార్లు చాంపియన్ బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
- రంజీ ఫైనల్‌కు తొలిసారి
- బెంగాల్‌పై చారిత్రక విజయం
కల్యాణి(పశ్చిమబెంగాల్): సుదీర్ఘ నేపథ్యం కల్గిన రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. అరంగేట్రం చేసిన 67 ఏండ్ల తర్వాత తొలిసారి టోర్నీలో ఫైనల్ చేరి ఔరా అనిపించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ పోరులో నిలిచింది. రెండు సార్లు చాంపియన్ బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ బెంగాల్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 43/2తో బ్యాటింగ్‌కు దిగిన జమ్మూకశ్మీర్ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. 12 పరుగుల ఓపెనర్లు ఖజురియా(1), హసన్ (6) వికెట్లు కోల్పోయిన జట్టును ఓవర్‌నైట్ బ్యాటర్లు శుభమ్ పందిర్(27), వంశజ్ శర్మ(43 నాటౌట్) ఆదుకున్నారు. సీనియర్ స్పీడ్‌స్టర్ మహ్మమద్ షమీ నేతృత్వంలోని బెంగాల్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ లక్ష్యం వైపు వడివడిగా సాగారు. పందిర్తో పాటు కెప్టెన్ పారస్ డోగ్రా(9) వెంటవెంటనే ఔటైనా..అబ్దుల్ సమద్(27 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, 3సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
టీమ్ఇండియాకు ఆడిన షమీ, ఆకాశ్‌దీప్, ముకేశ్‌కుమార్, షాబాజ్ అహ్మద్ లాంటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముకేశ్ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో సిక్స్ కొట్టి వంశజ్ మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. ఆకాశ్‌దీప్(3/46) మూడు వికెట్లు దక్కాయి. తొమ్మిది వికెట్లతో జట్టు చారిత్రక విజయంలో కీలకంగా వ్యవహరించిన అకీబ్ నబీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

