హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మ కం, విశ్వాసం ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. దానం నాగేందర్ పార్టీ మారిండు అనేందుకు అవసరమైన సాక్ష్యాలను స్పీకర్‌కు అందించామని చెప్పా రు. దానం కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారని, ఇందుకు సం బంధించిన ఆధారాలను అందించామని తెలిపారు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కా వాలని అన్నారు. న్యాయం గెలుస్తుందని, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయమని స్పష్టంచేశారు.
రాజ్యాంగాన్ని కాపాడాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం తన చాంబర్ లో విచారణ చేపట్టారు. పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని దానం తర ఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశా రు. సుమారు ఐదు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. అనంతరం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వి చారణలో భాగంగా ప్రతి ప్రశ్నకు సమాధా నం చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్మున్షీ, టీపీసీసీ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో 2024 మార్చి 15న దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు.
2024 మార్చి 21న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో సికింద్రాబాద్ అభ్యర్థిగా నాగేందర్‌ను ప్రకటించినట్టు చెప్పారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 4.29లక్షల ఓట్లు పొందారని తెలిపా రు. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందించినట్టు చెప్పారు. ఇది క్లి యర్కట్ కేసు అని, దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఓ వైపు రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కుతున్నదని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారని, మరి ఇక్కడ రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మె ల్యే కడియం శ్రీహరి పిటిషన్‌పై స్పీకర్ గురువారం విచారణ చేపట్టనున్నారు.