మధిర, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని జయశంకర్ అని కొనియాడారు.
తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని అన్నారు. ఆయన బాటలో మాజీ సీఎం కేసీఆర్ నడిచి రాష్ట్రాన్ని సాధించారన్నారు.ఈ కార్యక్రమంలో చిత్తారు నాగేశ్వర్రావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి. యెన్నంశెట్టి వెంకట అప్పారావు, ఐలూరు ఉమామహేశ్వర్ రెడ్డి, ఆళ్ల నాగబాబు, డోకుపర్తి సత్యంబాబు, షేక్ ఖాదర్, అబ్దుల్ ఖురేషి, పరిశ శ్రీనివాస్‌రావు, చీదిరాల రాంబాబు, గుగులోతు కృష్ణ నాయక్, వేల్పుల శ్రీనివాసరావు, నాగలవంచ రామారావు, షేక్ సైదా పాల్గొన్నారు.