పాల్వంచ, జూలై 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ (మున్సిపాలిటీ) కార్యాలయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలో జరుగుతున్న అనేక అవినీతి ఆరోపణలపై హైదరాబాద్ ఏసీబీ అధికారులకు పట్టణవాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.45 గంటలకు కార్యాలయానికి చేరుకున్న అధికారులు వెంటనే ఆఫీసు తలుపులన్నీ మూసివేసి కార్యాలయ సిబ్బందితోపాటు అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇతరుల దగ్గర ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మేనేజర్ సత్యనారాయణతోపాటు సిబ్బంది అందరి వద్ద విచారణ చేపట్టారు. కార్యాలయంలోని రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపకుండా సిబ్బంది వద్ద ఉన్న రూ.46,760 వ్యక్తిగత నగదు, రిజిస్టర్లో ఉన్న వాటికి తేడా ఉండడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ రికార్డులు కూడా సక్రమంగా లేవనే నిర్ధారణకు వచ్చిన అధికారులు అవినీతి, అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సెల్ఫోన్లు, యూపీఐ బదిలీలను పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఇతరులను బయటకు పంపించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత అక్కడి కార్యాలయంలో ఉండడంతో ఆమెకు సమాచారం అందించిన అధికారులు పాల్వంచ కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పారు. సాయంత్రం 4.30 గంటలకు ఆమె కార్యాలయానికి చేరుకోవడంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ రమేశ్ మాట్లాడుతూ కార్యాలయంలో ఇంకా తనిఖీలు పూర్తి కాలేదని, అవినీతి ఆరోపణలకు సంబంధించి అనధికారిక ప్రొసీడింగ్స్, ఇతర అంశాలన్నింటిపై ఫిర్యాదులు రావడంతో దాడులు చేపట్టామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రస్తుతానికి రికార్డుల్లో లేని వ్యక్తిగత నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
42 శాతం రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్, రూ.లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి బీసీలను మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మంలో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాల దృష్ట్యా 2023లో పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ కాటేసి కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. ఇంతటి నీచ రాజకీయాలు ఉంటాయని డాక్టర్ బీఆర్ అంబేదర్ కూడా ఊహించలేదని, అందుకే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రీకాల్ వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరచలేదన్నారు. ప్రతినాయకుడు ఉంటేనే నాయకుడి విలువ తెలుస్తుందని, గుర్రం విలువ తెలవాలంటే గాడిదను చూడాలని, కాంగ్రెస్ అనే గాడిద తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకాలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడానికి ప్రతీ కార్యకర్త కష్టపడాలని, పార్టీ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కార్యకర్తలు ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ టీడర్ షేక్ మక్బుల్, బచ్చు విజయ్‌కుమార్, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరునాయక్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రాంమ్మూర్తి, కొత్తా వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.