కారేపల్లి, ఆగస్టు 15 : గుండెపోటుతో మృతి చెందిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు పార్థీవ దేహాన్ని శుక్రవారం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సందర్శించి ఘన నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో గల జడల కాంప్లెక్స్‌లో ఉన్న వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్, కూరాకుల నాగభూషణం, టీబీజీకేఎస్ నాయకులు జాఫర్ హుస్సేన్‌తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇతర అన్ని పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
కారేపల్లి మండలం సూర్య తండాకు చెందిన ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుతో పాటు పలువురు అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Karepalli : తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి
Karepalli : తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి