మధిర, మే 07 : ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడితో పాటు సమానంగా చూడాలన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని లడక బజార్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మా ఇంటి మణి దీపం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లకు జన్మనిచ్చిన షేక్ సుభాని, కరిష్మా దంపతులను సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ బాలత్రిపుర సుందరి, సూపర్వైజర్లు కె.జ్యోతికుమారి, టి.సుజాత కుమారి, పి.అన్నపూర్ణ, జె.సత్యవతి, వార్డు ఆఫీసర్ షేక్ గౌషాబేగం, ఆశ వర్కర్ ముంతాజ్, ఏఎన్ఎం వై.లక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి, లంకా కొండయ్య పాల్గొన్నారు.