ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 23 : కంటి వెలుగుతో మసకలు మాయమవుతున్నాయి. గత నెల19న ఖమ్మం రూరల్ మండలంలో మలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో మూడు బృందాలు 9,163 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బం ది కలగకుండా టెంట్లు, షామియానాలు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైనవారికి అక్కడిక్క డే రీడింగ్ గ్లాసులు, మందులు అందజేస్తున్నా రు. సమస్య తీవ్రత ఉన్నవారికి వారంపదిరోజు ల్లో కళ్లజోడ్లను అందజేస్తున్నారు. ఆపరేషన్ అనివార్యమైనవారి వారి వివరాలను సేకరిస్తున్నారు.
వందరోజుల కార్యాచరణ
మలివిడత కంటి వెలుగులో భాగంగా నేటి వరకు ఎంవీ పాలెం, పోలెపల్లి, కామంచికల్, దారేడు, జాన్బాద్తండా, ఆరెకోడు గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు 9,163 మందికి కంటి పరీక్షలు చేశారు. 1,366 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరో 1,495 మందికి కళ్లజోళ్ల పంపిణీ చేయాలి. 286 మందికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. 100 రోజుల్లో లక్ష మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆరెకోడుతండా, కొండాపురం, పల్లెగూడెం గ్రామాల్లో ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా
గతేడాది కంటి వెలుగులో ఇచ్చిన అద్దాలతోనే ఇంతకాలం తిరిగాను. వాటి టైం అయిపోయింది కొత్తవి తీసుకోవాలని చెప్పారు. మరోసారి ఖమ్మంలో చూపెట్టుకుందామని అనుకున్నా. ఈ లోపు మళ్లీ కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేశారు. పదిరోజుల్లో కళ్లజోడు ఇస్తామన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– కోలపుడి వేణి, ఎం వెంకటాయపాలెం, రూరల్మండలం
గ్రామంలోనే పరీక్షలు
వృద్ధులు ఖమ్మం వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే ఇబ్బంది. తెలంగాణ ప్రభుత్వం గ్రామంలోనే కంటి పరీక్షలు చేయడం సంతోషంగా ఉంది. శిబిరంలో వైద్యులు కంటి పరీక్ష చేసి డ్రాప్స్ డబ్బా, మందులు ఇచ్చి పంపించారు. పదిరోజుల తర్వాత అద్దాలు ఇస్తామన్నారు.
– యామిని వెంకటేశ్వర్లు, ఎం వెంకటాయపాలెం, రూరల్ మండలం