మామిళ్లగూడెం, నవంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దహనం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, పాల్వంచ స్టేషన్ల పరిధిలో 54 కేసుల్లో పట్టుబడిన రూ.2.48 కోట్ల విలువైన 993 కేజీల గంజాయిని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాల్పేట గ్రామంలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్‌లో దహనం చేశారు.
కొత్తగూడెం స్టేషన్లో 25 కేసుల్లోని 33.790 కేజీలు, పాల్వంచ స్టేషన్లో 15 కేసుల్లోని 408.371 కేజీలు, మణుగూరు స్టేషన్లో 2 కేసుల్లో 52.520 కేజీలు, ఇల్లెందు స్టేషన్లో 10 కేసుల్లో 108.372 కేజీలు, అశ్వారావుపేట స్టేషన్లో 2 కేసుల్లో పట్టుకున్న 37.500 కేజీల గంజాయిని దహనం చేయించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కాగా.. భారీ ఎత్తున పట్టుకుని స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేయడం పట్ల జిల్లా అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అభినందించారు. దహనం కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య, సీఐలు పాల్గొన్నారు.