కామేపల్లి, సెప్టెంబర్ 5: రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేపల్లి, నెమలిపురి, గోవింద్రాల, పింజరమడుగు, టేకులతండా, తాళ్లగూడెం, జోగ్గూడెం గ్రామాల్లో మంగళవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. రాయిగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి హరిప్రియ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేలా ముందుకు వస్తారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.
తొలుత ఎమ్మెల్యేకు పండితాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు దాడికి తీవ్రగాయాలపాలైన చల్లా శశిని పరామర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటనలో భాగంగా ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆంతోటి అచ్చయ్య, కొండాయిగూడెం గ్రామ అధ్యక్షుడు యలమద్ది అప్పారావు, నాయకులు కొమ్మినేని శ్రీనివాసరావు, చల్లా హరి, దండగల దేవేందర్, దొడ్డ మల్లేశ్, బానోత్ రాములు, ఐతనబోయిన విఠల్, నాగేశ్వరరావు, శీలం పుల్లయ్య, లకావత్ భీమా, జర్పుల బాల, బానోత్ రవి, మూడ్ రాధ, వడియాల కృష్ణారెడ్డి, నాగండ్ల లక్ష్మణ్చౌదరి, పుచ్చకాయల కోటయ్య, రామకృష్ణ, సింగం వెంకన్న, శెట్టి శ్రీనివాస్, జర్పుల భగవాన్ పాల్గొన్నారు.