మూడు నియోజకవర్గాల అభివృద్ధికి రూ.2.10 కోట్లు
జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ నిధులు రూ.2,10,60,000 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
- బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా
మామిళ్లగూడెం, ఫిబ్రవరి19 : జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ నిధులు రూ.2,10,60,000 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ రోడ్లు, కల్వర్టులు, పాఠశాలలు, అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్ల ప్రహరీల నిర్మాణానికి ఎంపీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రఘునాథపాలెం మండలం మల్లేపల్లి, బద్యాతండా, హర్యాతండా, మధిర మండలం కృష్ణాపురం, నాగవరప్పాడు, ఇల్లూరు, ముదిగొండ మండలం పెద్దమండవ, ఖానాపురం, వల్లభి, గోకినేపల్లి, ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం, అయ్యవారిగూడెం, ఇనగాలి, జమలాపురం, కొత్తపాలెం, నర్సింహాపురం, భీమవరం, బోనకల్లు మండలం గోవిందాపురం, రావినూతల, నారాయణపురం, పెద్దబీరవల్లి, చింతకాని, మండలం అనంతసాగర్, పాతర్లపాడు, బొప్పారం, నాగులవంచ, నాగిలిగొండ, నేలకొండపల్లి మండలం సదాశివపురం, తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లి, ఎర్రగడ్డ, భద్రాద్రి కొత్తగూడెం బాబు క్యాంప్, జూలూరుపాడు మండలం పాపకొల్లు(కొత్తూరు) గ్రామాల్లో మంజూరైన ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా.. మూడు నియోజకవర్గాల్లో చేపట్టనున్న పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా గ్రామాల పురోభివృద్ధికి భారీగా ఎంపీ నిధులు ఖర్చు చేసినట్లు ఎంపీ నామా పేరొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

