రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పంటల పెట్టుబడి కోసం రాష్ట్రంలోని అన్నదాతలకు రూ.65 వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బోనకల్లు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. పరాయి పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందని, ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని అన్నారు. దేశం అబ్బురపడేలా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
బోనకల్లు, మే 12: దేశం అబ్బురపడేలా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పంటల పెట్టుబడి కోసం రాష్ట్రంలోని అన్నదాతలకు రూ.65 వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందని స్పష్టం చేశారు. బోనకల్లు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. మార్క్‌ఫైడ్ ఏర్పాటు చేసిన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. పరాయి పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందని, ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన సంస్కరణల గురించి, అన్ని రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి పార్లమెంటు సమావేశాల్లో తాను చెబుతుంటే మిగతా రాష్ర్టాల ఎంపీలంతా అబ్బురపడిపోతుంటారని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను తెలంగాణ తప్ప మరేరాష్ట్రమూ కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఇక్కడి అభివృద్ధి గమనించిన మిగతా రాష్ర్టాల ప్రజలు తమకూ కేసీఆర్ లాంటి పాలకుడు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదే క్రమంలో కులమతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. అలాగే సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జడ్పీ, టీఎస్ సీడ్స్, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమలరాజు, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు చేబ్రోలు మల్లికార్జునరావు, బొమ్మెర రామ్మూర్తి, చిత్తారు సింహాద్రియాదవ్, మోరంపూడి ప్రసాద్, మంకెన రమేశ్, చావా వెంకటేశ్వరరావు, జంగా రవి, ఉపేంద్ర, రమేశ్, గుండపునేని సుధాకర్‌రావు, యార్లగడ్డ చిన్ననరసింహా, డీఎం సునీత, వేమూరి ప్రసాద్, సీహెచ్ వెంకటేశ్వరరావు, మోర్ల నరసింహారావు, మోర్ల శ్రీనివాసరావు, మండేపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టడం ఎవరి వల్లా కాదని, ఆయనను ఓడించే సత్తా ఎవరికీ లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తన సిఫార్సుతో మధిర నియోజకవర్గంలో 100 మందికి మంజూరైన రూ.26.47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బోనకల్లులో రైతువేదికలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఢీకొనాలని చూసే వారు బోర్లాపడడం ఖాయమని అన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం హ్యాట్రిక్ సాధిస్తారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పట్ల అవాకులు చవాకులు పేలేవారి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, తమ్మారపు బ్రహ్మయ్య, కొమ్మినేని ఉపేంద్ర, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.