Dharmaram | ధర్మారం, జనవరి 27 : యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి రాంబాబు అన్నారు. గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులలో 50 గ్రామాల్లో నిర్వహించారు.
ఈ క్రమంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో యువజన నాయకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీవైవో వెంకట రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న యువజన సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు యువజన సంఘాలు లేని ప్రాంతాల్లో నూతన సంఘాలను ఏర్పాటు చేసి, వారిని మై భారత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విభాగాలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
దీనివల్ల భవిష్యత్తులో మై భారత్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గ్రామీణ యువత చురుగ్గా పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆర్గనైజర్ రేషవేణి మహేష్, యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రేషవేణి సిద్ధార్థ, ఉపాధ్యక్షులు రాహుల్, కార్యదర్శి సోను యూత్ సభ్యులు రిషి ,ఆదర్శ్, రాకేష్, ఇర్ఫాన్, నితిన్ యువజన సంఘాల నాయకులు ధీరజ్ రాజు తదితరులు పాల్గొన్నారు.