Jeevan Reddy | జగిత్యాల, జూలై 8 : మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డికి జగిత్యాలతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అభిమానులు ఉన్న నాయకుడని కొనియాడారు. దేశంలోనే అత్యంత వరి ధాన్యం ఉత్పత్తికి కారణం ఆయన ఉచిత విద్యుత్ అందజేయడమే కారణమని, రైతులకు ఉచిత విద్యుత్ తెరపైకి తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్సాఆర్ అన్నారు. రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108 వాహన సౌకర్యం, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బండ శంకర్, కొత్త మోహన్, గాజంగి నందయ్య, మన్సూర్, తాటిపర్తి విజయ లక్ష్మీ దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అనిత, అనుమల్ల జయశ్రీ, దుర్గయ్య, గాజుల రాజేందర్, రమేష్ రావు, మసర్తి రమేష్, ధర రమేష్ బాబ్, గోపి రాజిరెడ్డి, సుభాష్, నవీన్ రావు, పుల్లూరి సత్యనారాయణ, మహిపాల్, కొండ్ర రామచంద్ర రెడ్డి, రూప రెడ్డి, అనుమల్ల రామచందర్, గుండా మధు, గుంటి జగదీశ్వర్, శ్రీరాముల రెపల్లి హరి పులి రాము నక్క జీవన్ లక్ష్మీనారాయణ గంగాధర్, జితేందర్ ప్రదీప్, నరేష్, గిరిధర్, గౌతమ్, చెట్టె గంగాధర్, మైహిపాల్, రఘువీర్ గౌడ్, రాజేష్, అభి, అద్నాన్, తదితరులు పాల్గొన్నారు.