Huzurabad| హుజూరాబాద్ రూరల్, జనవరి 27: యువత సామాజిక బాధ్యత తీసుకోవాలని, సమాజానికి సహకారం అందించాలని హుజారాబాద్ ఏసీపీ వీమాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ఏడు రోజుల ప్రత్యేక శిబిరం మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత శ్రమదానం, రక్తదానం చేయలని సూచించారు. రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలన్నారు. సమాజానికి ఉపయోగ పడే సేవలు చేయాలని, తల్లిదండ్రుల క్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుతే ప్రభుత్వ, ప్రవేటు రంగాలలో చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు పోలీసు శాఖలోకి రావాలని, పోలీసు ఉద్యోగం చేయడం వల్ల తమకు తమ రక్షణతో పాటు ఇతరులకు రక్షణ ఇచ్చినవారమవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడిగూటి కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎంబాడి రవి, లోఖండే రవీందర్, అధ్యాపకులు డాక్టర్ గణేష్, డాక్టర్ రాజేంద్రం, డాక్టర్ మాధవి, డాక్టర్ శ్యామల, రాజకుమార్, పీ శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్, డాక్టర్ సుష్మ, డాక్టర్ రవి ప్రకాష్ రావు, సాయి కుమార్, అరుణ్ కుమార్, సీనియర్ ఆసిస్టెంట్ డీ తిరుపతి, వార్డు సభ్యులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.