Cricket | పెగడపల్లి : ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పెగడపల్లి మండల రైతు సంఘం నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఐతుపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముంగింపు వేడుకలు మంగళవారం జరిగాయి. ఇందులో మల్లారెడ్డి పాల్గొని విజేత బతుపల్లి జట్టుకు నగదు బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులకు తన వంతుగా ప్రోత్సాహాన్ని తప్పకుండా అందిస్తానని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు బొమ్మగోని జితేందర్, పలుమారు అంజయ్య, పలుమారు విజయ్య యాదవ్, జిట్టవేని గంగయ్య, మల్లయ్య, జలందర్, రాజేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.