MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, సెప్టెంబర్ 24: యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నరి ఫోటో స్టూడియో, మణిదీప్ మాట్రిన్ షాపును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతీ,యువకులలో సృజనాత్మతకు కొదవలేదని, తమ ప్రతిభకు పదునుపెట్టి స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం షాపు నిర్వాహకులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, నాయకులు బట్టు సునీల్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.