Accident | వీర్నపల్లి, సెప్టెంబర్ 06: కంచర్ల శివారులో ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీర్నపల్లికి చెందిన భూత వినోద్ అనే యువకుడు బైక్‌పై వీర్నపల్లి నుంచి వేములవాడ వెళ్లున్నాడు. కంచర్ల శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు , బైక్ ఢీకొన్నాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వినోద్‌ను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ లెంకల లక్ష్మన్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, వీర్నపల్లి మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి తదితరులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వినోద్ కు ప్రభుత్వమే వైద్యం చేయించాలని కోరారు.