Electric shock | మల్లాపూర్, మే10 : గ్రామంలోని విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్తు షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం గొర్రెపల్లి లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు (32) అనే యువకుడు గొర్రెపల్లి గ్రామంలో ప్రైవేట్ విద్యుత్ హెల్పర్ గా పనిచేస్తున్నాడు.
శనివారం ఉదయం కరెంట్ స్తంభంపై విద్యుత్ తీగలు తెగిపోవడంతో మరమ్మతులు చేస్తున్న సమయంలో పైన ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు ఉన్న విషయం గమనించక ప్రమాద వశాత్తు ఆ తీగలు తగిలి కరెంట్ స్తంభం పైనే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.