Road accident | పెగడపల్లి: పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండంలోని బతికపల్లి గ్రామానికి వస్తుండగా, లింగాపూర్ గ్రామ సమీపంలోని ఎల్లమ్మ గుడి మూల మలుపు వద్ద వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్థంభానికి ఢీకొట్టింది.
కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. కాగా ఆనంద్ కు గత జులై నెలలోనే వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.