Electric shock | తిమ్మాపూర్, జూన్ 13: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో మోటార్‌కు వైరు తగలడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. హరీష్ కు భార్య దివ్య, బిడ్డ శ్రీహిత, కొడుకు అక్షయ్ అనే చిన్నపిల్లలు ఉన్నారు. కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న హరీష్ ఆకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.