Sucide | సైదాపూర్ ఆగష్టు 16: సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహూల్ (20) అనే యువకుడు పురగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం రాహూల్ గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగగా సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుండి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
కాగా శనివారం ఉదయం రాహూల్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. కాగా మృతుడికి ఇటీవల జ్వరంరాగా టెస్టులు చేయించగా పస్కలు వచ్చాయని ఆసుపత్రికి రెండురోజుల్లో తీసుకుని వెళ్తామని చెప్పగా అది మనసులో పెట్టుకుని పురుగుల మందు తాగినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
సెల్ఫీవీడియోతీసుకుని..
కాగా మృతుడు రాహూల్ పురుగుల మందు తాగేటప్పుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. పురుగుల మందు తాగుతూ అందరికీ బాయి.. మిస్యూ ఆల్.. హ్యాపీగా చస్తున్నా.. నేను మందే పిక్స్ అయినా అంటూ బెబుతున్న ఆ యువకుడి మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ల్మీడియాలో వైరల్గా మారాయి.