Hanging | యైటింక్లయిన్ కాలనీ, జూన్ 12: పట్టణంలోని షిర్కే క్వార్టర్స్‌లో గోషిక రోహిత్ అలియాస్ బిట్టు (29) అనే యువకుడు గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్వార్టర్లోని బెడ్ రూంలో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. రోహిత్ తండ్రి గోసిక ఆశోక్ సింగరేణి ఏఎల్పీ గనిలో పని చేస్తుండగా, కాలనీలోని ఎస్ టీ 2 – 1835 అనే క్వార్టర్ లో నివాసం ఉంటున్నారు.
గురువారం మధ్యాహ్నం బెడ్రూంలోకి వెళ్లిన రోహిత్ పై కప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో గది తెరిచి చూసేసరికి ఉరివేసుకొని చనిపోయినట్లు మృతుడి తల్లి పేర్కొంది. కాగా వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.