Suicide | ముత్తారం, జులై 06: మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడని తెలిపారు.
శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఏదో పురుగుల మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ హస్పటల్ కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ప్రవేట్ హాస్పటల్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించినట్లు మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడికి కూతురు లక్ష్మీ (11), కొడుకు యశ్వంత్ (10) ఉన్నారు.
కాగా చొప్పరి సది చనిపోవడం చాలా బాధకరమని ముత్తారం మాజీ ఎంపీపీ సుధాడి రవీందర్ రావు అన్నారు. మండల కేంద్రంలో ఓడేడ్ కు వెళ్లే మొయిన్ రోడ్ పై తాను చనిపోతానని వాహనాల ముందుకు వెళ్తుంటే అక్కడే ఉన్న తాను అతడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించానని కానీ తాను చనిపోయే ఆలోచనతో ఇంటికి వెళ్లి ఇలా పురుగుల మందు తాగి చనిపోయడం బాధాకరమని అన్నారు. ఎమైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదన్నారు.