Suicide | పెద్దపల్లి రూరల్, ఆగస్టు 2: పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అందుగులపల్లి గ్రామానికి చెందిన దుర్శెట్టి రాకేష్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేశాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పెద్ధపల్లికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. దవఖానలో చికిత్స పొందుతున్న రాకేష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడు రాకేష్ కు భార్య, కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.