Hanging | కథలాపూర్, మార్చి 31 : కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) అనే యువతి సోమవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం కథలాపూర్ కు చెందిన శృతి పీజీలో ఎంకాం కోర్సు పూర్తి చేసింది. గ్రూప్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఇటీవల గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాసినప్పటికీ మంచి ఫలితాలు రాలేదు.
వీటికి తోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యారు. ఏడాదికాలంగా శృతి కడుపు నొప్పితో బాధపడుతూ పలు దవాఖానల్లో చికిత్స పొందినప్పటికీ జబ్బు నయం కాలేదు. దీనికితోడు ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్థాపన గురైన శృతి సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఆకుల రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు.