చిగురుమామిడి, మార్చి 4 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి చిరంజీవి(30) అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండి రాజేశ్ తెలిపారు. మార్చి 1న సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో చిరంజీవి తల్లి బింగి గౌరవ్వ ఇచ్చిన దరఖాస్తు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తప్పిపోయిన యువకుడిని ఎవరైనా చూసినట్లయితే చిగురుమామిడి ఎస్సై ఫోన్ నెంబర్ కు 8712670772 సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. కరీంనగర్, హుస్నాబాద్, చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో చిరంజీవి ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నారని ఎస్సై తెలిపారు.