Assam elections | అసోం అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీయే కూటమి సీట్ల పంపకంపై సీఎం హిమంత క్లారిటీ
Assam elections : అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
Assam elections : కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా అసోం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. కూటమిగా పోటీ చేసే పార్టీలు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
అలాగే కూటమిలోని ఏజీపీ (అసోం గణ పరిషద్) పార్టీ 26 సీట్లలో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 11 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశానికి హాజరైన అనంతరం హిమంత బిశ్వశర్మ ఈ వివరాల్ని మీడియాకు తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా బుధవారం ఢిల్లీలోనే జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. అనంతరం బుధవారం రాత్రి లేదా గురువారం రోజు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బొర్దోలోయ్ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, అంశంపై తనకు సమచారం లేదని హిమంత శర్మ అన్నారు. 2021లో ఎన్డీయే కూటమి అసోంలో విజయం సాధించింది. బీజేపీ 93 సీట్లలో పోటీ చేయగా, 60 సీట్లలో గెలుపొందింది. అలాగే ఏజీపీకి 25 సీట్లు కేటాయించగా, 29 సీట్లలో పోటీ చేసింది. 9 సీట్లు మాత్రమే గెలుపొందింది. అలాగే యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. ఈ పార్టీకి 8 సీట్లు కేటాయిస్తే, 11 సీట్లలో పోటీ చేసింది. 6 సీట్లు గెలిచింది. మొత్తంగా కూటమి 75 సీట్లు సాధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AGP
- Assam elections
- BJP
- BPF
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

