government school | హుజురాబాద్ రూరల్ జూన్ 22 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది. సుమారుగా 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యావంతులు మేధావులను తయారుచేసిన పాఠశాల ప్రస్తుతం మూతపడడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పంపించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా..
గ్రామానికి మూడు వందల మీటర్ల దూరంలో ఈ పాఠశాల ఉంటుంది. చుట్టు పొలాలు పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన పచ్చడి చెట్ల మధ్య విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలతో అహల్లాదకరంగా ఉండే సరస్వతి ఆలయం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది మద్యం ప్రియులు తరచు ఇక్కడే మద్యం సేవించి కాళీ సీసాలను పగలగొడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కల్పించి పాఠశాలను పున ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.