Yadava Mahasabha elections | తిమ్మాపూర్, సెప్టెంబర్14: అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో సంఘం మండల అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా బాడీ కాలపరిమితి ముగిసినందున వెంటనే నూతన కమిటీని ఎన్నుకోవాలని, దానికి అనుగుణంగా కోర్ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న బాడీ సమయం ముగిసినందున వారు యాక్టివ్ గా లేరని దాంతో గొర్రెల కాపరులు, సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య వస్తే చెప్పుకునేందుకు నాయకుడు లేరన్నారు. జిల్లా కార్యాలయాన్ని పట్టించుకునే వ్యవస్థలేదని అన్నారు. కోర్ కమిటీ సభ్యులు స్పందించి వెంటనే జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల అధ్యక్షుడు నల్లెంగి కొమురయ్య యాదవ్, నాయకులు వేల్పుల ఓదయ్య, పొలం రాజయ్య, ఆవుల లచ్చయ్య, ఆవుల రాజు, మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.