World Population Day | జగిత్యాల, జూలై 11 : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్, హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ సంగీత రాణి, డీ సుజాత, జీ శ్రీలత, హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ నీరజ జనాభా విస్పోటనం వల్ల కలిగే లాభనష్టాలు దుష్పరిణామాలు ఫలితంగా దేశంలో పేదరికం నిరుద్యోగం సామాజిక అసమానతలు ఎలా పెంపొందించబడతాయో, ఫలితంగా దేశ అభివృద్ధి ఎలా కుంటుపడుతుందో వివరించారు.
భావిభారత పౌరులుగా జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించే బాధ్యత విద్యార్థులదే అని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చిన కళాశాల మొదటి సంవత్సరం బీకాం విద్యార్థిని అథిక ఆనంను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అధ్యాపకులు అభినందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, హెల్త్ క్లబ్ కో – ఆర్డినేటర్ జి నీరజ, జమున, మల్లికార్జున్, జ్యోత్స్న కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.