KondagattuUrban Park | మల్యాల, జూన్ 05: కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండగట్టు అర్బన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మోహినోద్దీన్ నేతృత్వంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొండగట్టు ఫారెస్ట్ అర్బన్ పార్కులో మొక్కలను నాటడం, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ చెత్తలను సేకరించి వ్యర్థాలను నిర్మూలించడం, తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
పర్యావరణం సమతుల్యంగా ఉన్నప్పుడే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, జీవ వాయువైన ఆక్సిజన్ సైతం సమృద్ధిగా లభిస్తుందని ఎఫ్ఆర్ఓ మోహినుఉద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ మౌనిక, సెక్షన్ అధికారి తోట రత్నమ్మ, బీట్ అధికారి ప్రవీణ్ కుమార్, ఆలయ సిబ్బంది ధర్మేందర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.