Former MLA Sunke Ravi Shankar | గంగాధర, ఆగస్టు 22: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణా సమాజన్ని దృష్టి మల్లించేందుకే కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర లేపిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, ఏళ్లకు ఏళ్లు పడకేసిన సమస్యలకు పరిష్కారం దొరికింది పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో గ్రామాల్లో పారిశుధ్య సమస్య అతి పెద్ద సమస్యగా ఉండేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని గుర్తు చేశారు. పట్టణాలతో సమానంగా భూములు ధరలు పెరిగగా, పల్లె వాసుల అవసరాలు తీరాయని చెప్పారు. గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్, రైతు వేదిక, వైకుంఠధామం, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, విద్యుద్దీపాల వెలుగుల్లో గ్రామాల స్వరూపాలు మారిపోయాయని పేర్కొన్నారు. ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతివనాలు, పరిశుభ్రంగా పల్లెలు, తలతలాడే రహదారులు మట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేవని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే జనం ఎక్కడ తిరగబడతారోనని భయంతోనే పనుల జాతర డ్రామాకు ప్రభుత్వం తెరలేపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని వేషాలు వేసిన జనం నమ్మే పరిస్థితి లేరని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.