RTC buses | కథలాపూర్, జోన్ 16 : కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆపడం లేదంటూ సోమవారం ఉదయం నిరసన తెలిపారు. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు గంబిర్పూర్ గ్రామానికి వెళ్లి తిరిగి కోరుట్ల కు వస్తున్న సమయంలో తండ్రియల గ్రామంలో బస్సులో గత నాలుగు రోజులుగా ఆపడం లేదంటూ మహిళలు ఆర్టీసీ బస్సు వద్ద నిరసన తెలిపారు.
వారం రోజుల క్రితం కోరుట్ల డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చామని అయినా కూడా అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలలో ప్రారంభమైన వేల మా గ్రామం నుండి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయని తప్పకుండా తండ్రియాల గ్రామంలో బస్సులు ఆపాలంటూ మహిళలు కోరుతున్నారు.