Karimnagar DCC office | కరీంనగర్ : కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవి సీనియర్లకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి కేటాయించారంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పని చేస్తామని తమను కాదని అనేకమార్లు పార్టీ మారిన నాయకురాలకు పదవులు కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జండా పట్టుకొని పనిచేసిన తమలాంటి నాయకులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. వెంటనే నగర అధ్యక్షురాలు గా నియమించబడిన రజిత రెడ్డి పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడిగా పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్ మహిళలకే ఆ పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు షబానా, కవిత, మంజుల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.