Kalva Srirampur | కాల్వ శ్రీరాంపూర్, నవంబర్ 16 : పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సుదాటి రమ (50) తన వరి కోయడానికి పొలం వద్దకు వెళ్లింది.
వరి పొలాన్ని హార్వెస్టర్ కోయగా మిగిలిన వరిని కొడవలితో కోస్తుండగా ఆ వరిలో ఉన్న పాము కు కొడవలి తగిలి రమను కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. మృతురాలి భర్త సత్యనారాయణ రావు, కుమారుడు కరుణాకర్ రావు ఉన్నారు. రమ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే రమ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.