suicide | పెగడపల్లి: పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె నీరజ (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నీరజ గత కొంత కాలంగా ఉన్న అనారోగ్యాన్ని భరించలేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
మృతురాలి భర్త మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.