తిమ్మాపూర్, ఫిబ్రవరి25 : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురువారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా ఉన్న వైన్స్ లను(Wine shops) ఎక్సైజ్ పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకే క్లోజ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు వచ్చి వైన్స్ షెటర్లకు నోటీసులు అంటిస్తుండడంతో మందుబాబులు ఏం జరుగుతుందో తెలియక కొంత అయోమయానికి గురయ్యారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వైన్స్ షెటర్లకు ఓ వైపు అధికారులు షటర్లు క్లోజ్ చేసి సీల్ చేస్తుండగానే మరోవైపు వైన్స్ నిర్వాహకులు మద్యం అమ్మకాలు కొనసాగించారు. ఎక్సైజ్ ఎస్సై భారతి సిబ్బందితో షెటర్లు క్లోజ్ చేసి సీల్ చేశారు. గురువారం ఎన్నికలు పోలింగ్ 4గంటలకు పూర్తయ్యాక తాము సమాచారం అందించిన తర్వాత ఓపెన్ చేయాలని నిర్వాహకులకు ఎస్ఐ భారతి సూచించారు.