పెద్దపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తకు నడకలు నేర్పుతున్నది. 2025 మేలోనే పూర్తి చేయాల్సి ఉన్నా.. మూడున్నరేళ్లుగా సాగుతున్నది. పెద్దపల్లి రైల్వే జంక్షన్ మీదుగా నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు కొనసాగుతుండగా, గంటకు నాలుగైదుసార్లు గేటు పడుతుండడంతో ప్రయాణికులు న రకం చూడాల్సి వస్తున్నది. పెద్దపల్లి నుంచి ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ రైల్వేమార్గం ఉండగా, ప్రతి పదిహేను నిమిషాలకోసారి గేటు పడుతున్నది.
గతంలో బీఆర్ఎస్ సరారు ఈ సమస్యను పరిషరించేందుకు రాష్ట్రం 60శాతం, కేంద్రం 40శాతం భాగస్వామ్యంతో ని ర్మించాలని నిర్ణయించి, సంయుక్తంగా రూ.119.5 కోట్ల నిధులను మం జూరు చేశాయి. 2022 అక్టోబర్ 10న పనులు ప్రారంభం కాగా, అప్పు డు వేగంగా సాగాయి. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత తీవ్ర జా ప్యం జరుగుతున్నది. మరింత భూసేకరణ చేయాల్సి ఉన్నది. బ్రిడ్జి 46 స్లాబులకు రెండు స్లాబుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. అలాగే, వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, అప్రోచ్ ఆర్ఈ వాల్స్ నిర్మించా ల్సి ఉన్నది. దీంతో వాహనదారులు ప్రతిరోజూ నరకం చూస్తూనే ఉ న్నారు. కాగా, ఈయేడాది డిసెంబర్ వరకు నిర్మాణాన్ని పూర్తిచేసే విధం గా చర్యలు చేపడుతున్నామని ఆర్అండ్బీ ఈఈ భావ్‌సింగ్ తెలిపారు.