కరీంనగర్ రూరల్, ఆగస్టు 16: లారీ అసోసియేషన్‌కు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ బైపాస్‌లోని సత్యసాయి గార్డెన్లో పట్టణ లారీ ఓనర్ల అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాజికవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అభయమిస్తున్నదని, అభివృద్ధిలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నదని చెప్పారు. లారీ అసోసియేషన్‌కు పార్కింగ్ స్థలం కేటాయింపునకు ఇప్పటికే అధికారులతో మాట్లాడామని, బొమ్మకల్‌లోని గోపాల్ చెరువు వద్ద మూడెకరాలు కేటాయించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, విద్యుత్ సమస్యలు, సాగునీటి కొరత ఇబ్బందులు తీర్చుకున్నామని వివరించారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయని, ప్రతి ఎకరానికి పుష్కలంగా నీరందుతున్నదని చెప్పారు. నాటితో పోల్చితే పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. లారీల యజమానులకు లాభాలు తెచ్చిపెట్టేది ఫెర్టిలైజర్స్, సీఎంఆర్ బియ్యం తరలింపేనని, వ్యవసాయ రంగ అభివృద్ధితో వారికి పుష్కలంగా గిరాకీ దొరుకుతున్నదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళికతో ఒక్కో లారీ యాజమాని భవిష్యత్‌లో పది లారీలు కొనే స్థాయికి ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ టాక్సీ పేరిట లారీ యజమానులను నిండా ముంచుతున్నదని, దానిని తొలగించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని వివరించారు. రాష్ట్రంలో రోడ్డు టాక్సీల విషయాన్ని మంత్రి గంగులతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తగ్గించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారం మా బాధ్యత: మంత్రి గంగుల
లారీ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. లారీ అసోసియేషన్ సభ్యులకు, ప్రభుత్వానికి అసోసియేషన్ ఒక వారధిగా ఉండాలని సూచించారు. అసోసియేషన్ దీర్ఘకాలిక సమస్య త్వరలో తీరుతుందని, గోపాల్ చెరువు వద్ద పార్కింగ్ స్థలం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. పెంచిన రోడ్డు టాక్సీల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగ్గించేందుకు కృషిచేస్తామని చెప్పారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి షేక్ రహీమొద్దీన్, కోశాధికారి సయ్యద్ మిన్హాజ్ ఉద్దీన్, ఉపాధ్యక్షుడు ఎండీ ఖాజమోహినొద్దీన్, కాల్వ మనోహర్‌యాదవ్, సింగిరెడ్డి రామకృష్ణరెడ్డి, సహయ కార్యదర్శులు మతీన్బీన్అలీ, షేక్ షాజీద్పాషా, కమటం కనుకరాజుతో లాయర్ మధుసూదన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇక్కడ మేయర్ వై సునీల్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, గులాం అహ్మద్, లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, లారీ ఓనర్ల అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చాంద్ పాషా, రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, రాష్ట ఫర్టిలైజర్ అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్, ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భువనగిరి వేణుగోపాల్కిషన్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి చంద్రశేఖర్‌గౌడ్ ఉన్నారు.