జగిత్యాల కలెక్టరేట్, జనవరి 23: ‘కాంగ్రెస్‌వన్నీ దొంగ వాగ్దానాలే. 420 హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని..? వారి దృష్టిని మరల్చేందుకు ఆ పార్టీ నాయకులు గత ప్రభుత్వంపై బురద జల్లడం, బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నరు. మేమొక్కటే చెబుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపులు, బెదిరింపులకు భయపడేదిలేదు. ప్రతి విషయాన్ని తిప్పికొడతాం’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని కాంగ్రెస్ నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారని, కానీ నేడు కాల్వలు, చెరువుల్లో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు యూరియా కోసం మళ్లీ క్యూ కట్టే దుస్థితి దాపురించిందని చెప్పారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఎప్పుడు వస్తుందా..? అని అటు రైతులు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారని..? ఇటు మహిళలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇంకా పెంచిన పెన్షన్ ఇప్పుడిస్తరని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు వే యి కండ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. రైతుబం ధు సాయం సీజన్ దాటిపోతున్నా అందలేదన్నారు.
కాళేశ్వరంపై అన్నీ అబద్ధాలే..
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూ.90వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో..? చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో తాము ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. ప్రాజెక్టు ద్వారా ఎకరాకు కూడా నీరందలేదని జీవన్‌రెడ్డి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన నాలుగన్నరేండ్లలో తొమ్మిది పంటలకు నిరాటంకంగా ఒక్క ఎకరా ఎండకుండా నీరందించామని వివరించారు. ఊ అంటే చాలు గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసిందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, మరి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే రూ.9వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టవద్దని కేంద్రం పై కేసీఆర్ యుద్ధం చేశారని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి రూ.9వేల కోట్ల అప్పు కోసం మోటర్లకు జియో ట్యాగింగ్ చేసేందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ సాకు తో హామీల అమలును కాలయాపన చేసేందుకే కాంగ్రెస్ వంద రోజుల టైం పెట్టిందని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, తమ పార్టీ నా యకులపై కక్ష సాధింపులకు దిగడం, బెదిరించ డం, సర్పంచులను సస్పెండ్ చేయించడం, కేసు లు పెట్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్ సీనియ ర్ నేత జీవన్‌రెడ్డి కండ్లులేని మనిషిలా మాట్లాడుతున్నారని, కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదని తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, అభివృద్ధి జరుగకపోతే ఎలా గెలుస్తామ ని ప్రశ్నించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రవిశంక ర్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హ రిచరణ్రావు, బీఆర్ఎస్ నాయకులు సతీశ్, కోల శ్రీనివాస్, మల్లేశం, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.