KTR | కోల్ సిటీ టీ, జూన్ 8: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, కళాకారిణి, జబర్దస్త్ ఫేమ్ వర్షిణి మాజీ మంత్రి కేటీఆర్ చే ప్రశంసలు అందుకుంది. ఎల్లలు దాటిన ఆమె ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మలేషియాల లోని కౌలలంపూర్ లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బుల్లి తెర నటి వర్మని వర్షిణి పాల్గొని తెలంగాణ జానపద ఆట, పాటలతో అలరించింది.
వేదికపై మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైటా ప్రతినిధులు వర్షిణిని ఘనంగా సన్మానించి అభినందించారు. విదేశాల్లో చక్కటి ప్రతిభ కనబర్చి కేటీఆర్ చే ప్రశంసలందుకున్న వర్షిణిని గోదావరిఖని కళాకారులు పీఎస్ అమరేందర్, సర్వేష్ తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. వర్షిణి మాట్లాడుతూ తనకు అరుదైన అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. స్వయంగా కేటీఆర్ సార్ వేదికపై తనను సన్మానించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి కలిగిందని తెలిపారు.