జగిత్యాల రూరల్, జనవరి 11: రాష్ట్రంలో ప్ర తి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని, దళితుల ఆర్థిక అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 21 వార్డుల్లోని 54మంది లబ్ధిదారులకు రూ.17.80 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెకులు, 31 మందికి రూ.31లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్ చెకులను ఎమ్మెల్యే సంజయ్‌కుమా ర్ స్వయంగా ఇంటింటికీ వెళ్లి చెక్కులు అందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పరిషరిస్తూ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే పట్టణంలోని మోచిబజార్‌లో ఇటీవల పీ రాజయ్య దళితబంధు పథ కం ద్వారా ఏర్పాటు చేసుకున్న ఫుట్‌వేర్ షాప్‌ను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథ కం ద్వా రా ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా వైద్య సేవలందించామని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ లో గతంలో కంటే అధిక వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీని నిర్వీ ర్యం చేశారనడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలో 22 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, సూ పర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేశారని, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిజమైన నిరుపేదలకే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామని, నిస్పక్షపాతం గా సర్వే జరుగుతున్నదని, అసత్య ఆరోపణలను నమ్మవద్దని కోరారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల అర్బన్, జనవరి 11: పట్టణంలోని 10వ వార్డులోని ఎలుక బావి వద్ద సీడీపీ నిధులు రూ.5 లక్షలతో గంగపుత్ర సంఘ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గంగపుత్రులు అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదతో గంగపుత్రులు కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే నేడు పట్టణ మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా మారిందని, యావర్ రోడ్డు విస్తరణను గతంలో మంత్రులుగా ఉండి చేయలేకపోయారని, నేడు 1000 మీటర్లపైన వెడల్పు చేశామని చెప్పారు. నూతన నిర్మాణాలు 100 ఫీట్లలో జరుగుతున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రజల సౌకర్యార్థం కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రజల అభీష్టం మేరకే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.