Welfare schemes | సుల్తానాబాద్ రూరల్, జూన్ 30 : అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితేరాజుపల్లి, భూపతిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. అర్హులైన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజ చేసి వారికి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామాల్లోని పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టిందని తెలిపారు. అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు గుజ్జేటి వెంకన్న, ఎర్రం రాజు రెడ్డి, దాసరి రాజిరెడ్డి, ఎర్రం శ్రీనివాస్, రెడ్డి ఎర్రం అశోక్ రెడ్డి, బల్మూరి వెంకటరమణారావు, బక్కన్న, పోచంపల్లి చిన్నయ్య, దామోదర్ రావు, సతీష్, జానీ, సత్యనారాయణరావు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.