Karimnagar | కార్పొరేషన్, ఏప్రిల్ 13 : కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్ లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 28వ డివిజన్ కిసాన్ నగర్ లో రూ.25 లక్షల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ పనులకు ఆయన సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని ఆదర్శంగా దీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు.
ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామని అన్నారు. మురుగు నీటి సమస్య శాశ్వతంగా తోలగడంతో పాటు ఇరుకు గల్లిల్లో రోడ్డు విస్తరించడం దుర్వాసన, దోమల బెడద ఉండదన్నారు. గడువులోగా టెండర్ నిబంధన ప్రకారం నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ సోమిడి వేణు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.