Commonwealth Games | అదరగొడుతున్న యువ బాక్సర్లు.. క్వార్టర్ ఫైనల్లో అంకుశ్, సచిన్..!
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు చెలరేగుతున్నారు. సూపర్ పంచ్‌లతో ప్రత్యర్థులను ఓడిస్తున్న అంకుశ్(Ankush), సచిన్ సివాచ్(Sachin Siwach)లు పతక వేటలో దూసుకెళ్తున్నారు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు చెలరేగుతున్నారు. సూపర్ పంచ్‌లతో ప్రత్యర్థులను ఓడిస్తున్న అంకుశ్(Ankush), సచిన్ సివాచ్(Sachin Siwach)లు పతక వేటలో దూసుకెళ్తున్నారు. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుశ్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. 60 కిలోల ఇంగ్లండ్ బాక్సర్‌ను చిత్తు చేసిన సచిన్ సైతం క్వార్టర్స్ బెర్తు సాధించాడు. దాంతో, వీరిద్దరూ మరో బౌట్ గెలిచారంటే కనీసం కాంస్యం సొంతమవుతుంది.అయితే.. వీరు మాత్రం పసిడి పతకమే తమ లక్ష్యమంటున్నారు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 60 కిలోల విభాగంలో సచిన్ సివాచ్, 80 కిలోల విభాగంలో అంకుశ్‌లు క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు. సోమవారం జరిగిన 16వ రౌండ్ ఇంగ్లండ్ బాక్సర్ విలియం హెవిట్‌ను సచిన్ చిత్తు చేశాడు. ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడిన సచిన్ స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అంటున్నాడు.
#WATCH | Glasgow, Scotland: On defeating England’s William Hewitt in the men’s 60 kg round of 16 bout at the Commonwealth Games 2026, Indian boxer Sachin Siwach says, “It turned out really well after listening to my coach. Now, the goal isn’t just a medal; it’s gold. That’s what… pic.twitter.com/yFTIbFPYYe
— ANI (@ANI) July 27, 2026
‘కోచ్ మాటలు విన్న తర్వాత నేను పుంజుకున్నాను. నా లక్ష్యం పతకం గెలవడమే. అది కూడా గోల్డ్ మెడల్. టోర్నీ ఆరంభం నుంచి నేను పసిడి కోసమే పోరాడుతున్నా. తొలి రెండు మ్యాచ్‌లు కష్టంగా గట్టెక్కాను. తదుపరి బౌట్లకు నేను పక్కాగా సిద్ధమవుతా’ అని సచిన్ మీడియాతో వెల్లడించాడు.
ఏకపక్ష పోరులో
మరో పదహారో రౌండ్ మ్యాచ్‌లో హర్యానాకు చెందిన అంకుశ్ ధాటికి జలాన్ జాన్(అంటిగ్వా) చేతులెత్తేశాడు. 80 కిలోల విభాగంలో పోటీపడిన అంకుశ్ ఆరంభం నుంచి జలాన్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. దాంతో, భారత బాక్సర్ 5-0తో గెలుపొందాడు. ఏకపక్ష పోరులో సూపర్ విక్టరీ కొట్టిన ఈ పొడగరి బాక్సర్ అలవోకగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. సెమీస్ చేరితో చాలు అంకుశ్ దేశానికి కనీసం కాంస్యం అందించే అవకాశముంది.
🥊ANKUSH STORMED INTO THE QUARTER-FINAL
Ankush defeated Zalaan Jan🇦🇬 5:0 UD to reach the QF of Men’s 80 kg category at the Commonwealth Games.
QF vs Jade Micock🇸🇨 pic.twitter.com/p4PUvXgcFV
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

